2019 Current Affairs in Telugu PDF Download | కరెంట్ అఫైర్స్ తెలుగులో

Daily Current Affairs in Telugu (కరెంట్ అఫైర్స్ తెలుగులో): If you are a job seeker or enthusiastic about knowing the latest happenings in India & Telugu states, then you should check this article. We are maintaining this page up to date with latest Telugu current affairs. So, go through the below tables to check daily current affairs on monthly basis starting from January 2019 to Today.

current-affairs-telugu

May 2019 Current Affairs in Telugu

మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత లోక్‌సభలో మెజార్టీతో.. రెండోసారి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయనున్న ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. మే 23వ తేదీన వెలువడిన 17వ లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ 272 మార్కును సునాయాసంగా దాటింది.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించి మే 24న విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో అవగాహన ఒప్పందం కుదిరింది.
బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), జమాతుల్ ముజాహిదీన్ హిందుస్థాన్‌లపై భారత్ నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం వీటిని నిషేధిస్తున్నట్లు మే 24న ప్రభుత్వం తెలిపింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు మూడు నెలల్లో నిరంతరాయంగా ప్రయాణించి మే 15న కాన్పూర్ సమీపంలో కొచ్చే సమయానికి లక్ష కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.
సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో వున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని తషిగానగ్ అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా నమోదైంది.
ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ‘UNESCO’ ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో కైలాస్ మానస సరోవర్‌కు సంబంధించిన భారత భాగాన్ని చేర్చనున్నారు.
2019 సంవత్సరానికి రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 8వ స్థానం లభించింది. 2019 సంవత్సరానికి రూపొందించిన విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ మే 10న విడుదల చేసింది.
ఆసియా విశ్వవిద్యాలయాలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఇచ్చే ర్యాంకింగ్స్ లో 49 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.
వేదాంత దేశికులు 750వ జయంతి సందర్భంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే 2న ఢి ల్లీలో విడుదల చేశారు.
బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ఫొని తుపాను ఒడిశాలోని పూరీ సమీపంలో మే 3న తీరం దాటింది.

April Current Affairs in Telugu

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుపాను ఏప్రిల్ 29 తీవ్ర తుపానుగా మారింది.
 సైనిక వ్యయంలో అమెరికా, చైనా, సౌదీ అరేబియాల తరువాత భారత్ ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉందని స్టాకహోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఒక నివేదికను విడుదల చేసింది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2019లో భారత్‌కు 140వ ర్యాంకు దక్కింది. పారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ 180 దేశాలతో రూపొందించిన ఈ సూచీని ఏప్రిల్ 18న విడుదల చేసింది.
మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయితే వారిని ఉరి తీయకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలోని జస్టిస్ శంతనగౌండర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 18న ఈ తీర్పును వెలువరించింది.
1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగి 2019, ఏప్రిల్ 13నాటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన రూ. 100 స్మారక నాణెం, తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
భారత తీర రక్షక దళానికి చెందిన అధునాతన తీర గస్తీ నౌక ‘ఐసీజీఎస్ వీర’ను భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఏప్రిల్ 15న ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ గస్తీ నౌక గంటకు 26 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
దేశంలోని 158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2,14,766 సీట్లను కొత్తగా సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 15న ఆమోదం తెలిపింది. 2019-20 విద్యా సంవత్సరంలో 1,19,983 సీట్లను, 2020-21లో 95,783 సీట్లను సృష్టించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)-2019 పేరిట ఏప్రిల్ 17న ఒక నివేదికను విడుదల చేసింది.
దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్ నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలో ఏప్రిల్ 8న జరిగిన కార్యక్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విడుదల చేశారు.

March Current Affairs in Telugu

జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్)పై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకుంటున్నట్లు మార్చి 22న ప్రకటించింది.
అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో రత్‌కు 76వ ర్యాంకు లభించింది
మార్చి 25 న అమెరికాలో తయారైన నాలుగు చినూక్ సీహెచ్ 47ఎఫ్(ఐ) హెవీలిఫ్ట్ హెలికాప్టర్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు.
గోవా 13వ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఐక్యరాజ్య సమితి ‘హ్యాపినెస్ రిపోర్ట్-2019’లో భారత్‌కు 140వ స్థానం  దక్కింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలవగా తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదర్లాండ్‌‌స ఉన్నాయి.
పశ్చిమబెంగాల్‌లోని నారాయణ్‌గఢ్-ఒడిశాలోని భద్రక్ మధ్య రెల్వే శాఖ మూడో లైన్‌ను నిర్మించేందుకు కేంద్ర మంత్రి మండలి మార్చి 7న ఆమోదం తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 8న శంకుస్థాపన చేశారు
బోయింగ్ 737 మ్యాక్స్-8 విమానాలపై భారత ప్రభుత్వం మార్చి 12న నిషేధం విధించింది. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే.
మార్చి 1 అట్టారీ-వాఘా సరిహద్దున అభినందన్ వర్థమాన్ స్వదేశం  చేరుకున్నారు. 
పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019 న 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని సాంకేతిక నిర్మాణ సంవత్సరంగా ప్రకటించారు
భారత్-రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 3న శంకుస్థాపన చేశారు.  రైఫిళ్లపై ‘మేడ్ ఇన్ అమేథీ’ అని ఉంటుందని చెప్పారు. భారత రక్షణ బలగాల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగ చేర్చాలని రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
నెలకు రూ.15,000 కంటే తక్కువగా సంపాదిస్తున్న అసంఘటిత కార్మికుల కోసం ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ (పీఎం-ఎస్‌వైఎమ్) యోజన’ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 5న ప్రారంభించారు.
ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్ 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మార్చి 6న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2019: దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా మూడోసారి నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ పీర్జాదిగూడకు ఈ అవార్డులు దక్కాయి.

ఫిబ్రవరి Current Affairs in Telugu

జవాన్లకు ఢిల్లీ- శ్రీనగర్, శ్రీనగర్- ఢిల్లీ, జమ్మూ- శ్రీనగర్, శ్రీనగర్- జమ్మూ మార్గాల్లో ఉచితంగా విమాన ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు నిర్వహణ కాంట్రాక్టు ను అదానీ గ్రూప్ దక్కించుకుంది.
800 కేజీల బరువైన అతిభారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26న ఢిల్లీలోని ఇస్కాన్( అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం) ఆలయంలో ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 27 న ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2019’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఖేలో ఇండియా యాప్‌ను ఆవిష్కరించారు.
ఫిబ్రవరి 14 న లెత్‌పొరా, అవంతిపొరా, పుల్వామా జిల్లా, జమ్మూకశ్మీర్ లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
బిహార్ రాజధాని పట్నాలో రూ. 13 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేశారు.
పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ ను 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు
తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రామసేతు ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే శాఖ ప్రవేశపెట్టింది
కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 19న ఆమోదముద్ర వేసింది
రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫిబ్రవరి 20న ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు.
అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్ 36వ స్థానంలో నిలిచింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) ఫిబ్రవరి 7న ఆవిష్కరించిన ఈ సూచీలో అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి పేరుతో వైద్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశీయ తొలి ఇంజిన్ రహిత రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ సదస్సు- పెట్రోటెక్ 2019ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11న ప్రారంభించారు.
2019, ఫిబ్రవరి మాసాన్ని భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా రైల్వేశాఖ ప్రకటించింది.
ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6 వేల ఆర్థికసాయం అందించే PM Kisan పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించనున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో తొలి విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 3న ప్రారంభించారు.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 5న జరిగిన ఆసియా ఎల్‌పీజీ సదస్సులో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ మాట్లాడుతూ 2.5 మిలియన్ టన్నుల LPG (Liquid Petroleum Gas) వినియోగంతో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు చెప్పారు.
‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఒక కొత్త కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 6న ఆమోదం పలికింది. ఈ కొత్త కమిషన్ గోవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి అంశాలను పర్యవేక్షిస్తుంది.

2019 జనవరి Current Affairs in Telugu

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన Semi High Speed Train ‘ట్రైన్ 18’కు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ జనవరి 27న తెలిపారు. కాగా ఈ రైలు బండి వారణాసి-ఢిల్లీ మధ్య నడవబోతున్నట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకలు వేలం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్ (NGMA) మ్యూజియంలో జనవరి 27న ప్రారంభమైంది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు.
‘జైపూర్ సాహితీ వేడుక’లో ఆక్స్‌ఫర్డ్ జనవరి 26న, 2018 ఏడాదికి గానూ హిందీ పదంగా ‘నారీ శక్తి’ ని ఆక్స్‌ఫర్డ్ ప్రక టించింది.
‘పరీక్షా-పే చర్చ 2.0’ కార్యక్రమం జనవరి 29న ప్రధాని నరేంద్ర మోదీ థాల్కాటోరా స్టేడియం, న్యూఢిల్లీలో ప్రారంభించారు.
లోక్‌పాల్ చైర్మన్ మరియు సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటైన ‘అన్వేషణ’ కమిటీ భేటీ జనవరి 29 న్యూఢిల్లీ లో జరిగింది.
మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా గుజరాత్‌లోని దండిలో ఏర్పాటుచేసిన ‘జాతీయ ఉప్పు సత్యాగ్రహ సార్మకం, మ్యూజియం’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు.
ప్రపంచ అవినీతి సూచి - Corruption Perceptions Index (CPI) - 2018కి గానూ భారత్‌కు 78వ స్థానం దక్కింది. ఈ మేరకు 180 దేశాలతో కూడిన జాబితాను Transparency International సంస్థ జనవరి 30న విడుదల చేసింది. 100కి 41 పాయింట్ల స్కోర్‌తో భారత్ ఈ జాబితాలో 78వ స్థానం పొందింది. కాగా, 88 పాయింట్ల తో  డెన్మార్క్ అగ్రస్థానంలో, 10 పాయింట్ల స్కోరుతో సోమాలియా చివరి స్థానంలోనిలిచాయి.
హైదరాబాద్‌లో ‘అగ్రివిజన్-2019 సదస్సు’ను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జనవరి 17 న ప్రారంభించారు.
గుజరాత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టీ కంపెనీ యొక్క వజ్ర-హొవిట్జర్ (K9 Vajra self-propelled Howitzer guns) యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 19న ప్రారంభించారు.
తమిళనాడు రక్షణ పరిశ్రమల కారిడార్ (Defence Industrial Corridor) తిరుచిరాపల్లి, తమిళనాడు లో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 20న ప్రారంభించారు.
గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్-2019లో భారత్ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది.
అత్యంత పరిశుభ్రత పాటించినందుకు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా సికింద్రాబాద్ - పుణే మధ్య నడిచే  శతాబ్ది రైలు పేరు తెచ్చుకుంది. 
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా జనవరి 23 ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో మ్యూజియం ప్రారంబంచారు ప్రధాని.
ఐటీ సేవల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ మూడో స్థానంలో ఉన్నట్టు ‘బ్రాండ్ ఫైనాన్స్’ రిపోర్ట్ తెలియజేసింది. కాగా యాక్సెంచర్, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక జనవరి 10న ప్రకటించిన తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల జాబితాలో కర్ణాటకలోని ‘హంపీ’ నగరానికి రెండో స్థానం లభించింది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జనవరి 21 నుంచి 23 వరకు 15వ ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించనున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ జనవరి 11న వెల్లడించారు.
గురు గోబింద్ సింగ్ స్మారకముగా రూ. 350 వెండి నాణెం ఢిల్లీలో జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల 
జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటుచేయనున్నట్లు భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) జనవరి 13న వెల్లడించింది. ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈ విద్యుత్ కర్మాగారంను నెలకొల్పనున్నారు.
106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను జనవరి 3 న ప్రధాని నరేంద్ర మోదీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్ లో ప్రారంభించారు
బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వేధింపులు, హింసకు గురై భారత్‌కు వలసొచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పౌరసత్య బిల్లు’కు జనవరి 8న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు (EBC) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది
ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2018కు లోక్‌సభ ఆమోదం డిసెంబర్ 27న జరిగింది.
జూన్ నెల 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ విదేశీయానానికి రూ.2,021 కోట్లు ఖర్చయిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ డిసెంబర్ 28న వెల్లడించారు. 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను సందర్శించారని వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ సౌత్ ఏసియా రీజినల్ సెంటర్ (IRRI SARC) క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 29న ప్రారంభించారు. అనంతరం 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహేల్‌దేవ్ స్టాంప్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌ దీవులలో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం మూడు దీవుల పేర్లను మార్పు చేసింది. రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని మోదీ ఆవిష్కరించారు.
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీ)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించనున్నారు.
చమురు, గ్యాస్, ఇంధన రంగాలకు సంబంధించి పరిశోధనలు మరియు ప్రమాణాల వేదిక ఏర్పాటుచేయనున్నట్లు పెట్రోలియం శేఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు జనవరి 2న ఏడు చమురు కంపెనీలు (ఐవోసీ, ఓఎన్‌జీసీ, గెయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఆయిల్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా) ఐఐటీ బాంబే మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని తెలిపారు.

No comments:

Post a comment